Aadi Reddy: అఖిల్ సార్థక్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆదిరెడ్డి!
on Aug 12, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 మొదలవ్వకముందే గొడవలు మొదలయ్యాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ కోటగిరి కోసం సెలెక్షన్ ప్రక్రియ మొదలైంది. దానికి సంబంధించిన లీక్స్ బయటకొస్తున్నాయి. అయితే సెలెక్షన్ కోసం జడ్జులుగా బిందు మాధవి, అభిజిత్, నవదీప్ ని సెలెక్ట్ చేసింది బిబి టీమ్. దీనిగురించి అదిరెడ్డి తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పెట్టాడు.
ఆదిరెడ్డి పెట్టిన వీడియోలో.. అభిజిత్, బిందు మాధవిలతో పాటు అఖిల్ సార్థక్ ఉంటే బాగుండేది అని చెప్పేసి ఓ నవ్వు నవ్వాడు. అది చూసిన అఖిల్ సార్థక్ కి చివుక్కుమంది. దాంతో అతను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఆదిరెడ్డి క్రింజ్ రివ్యూవర్ అని పెట్టాడు. అది చూసిన అది రెడ్డి మళ్ళీ రియాక్ట్ అయ్యాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఇరవై ఆరు నిమిషాలతో కూడిన ఓ వీడియోని పెట్టాడు. అందులో నన్ను ఎంత ట్రోల్ చేసిన ఎంత నెగెటివ్ కామెంట్ చేసిన నేను రియాక్ట్ అవ్వను అంటూనే అఖిల్ సార్థక్ ని ఉతికారేసాడు అది రెడ్డి. నా వల్లే సంపాదించుకుంటున్నాడు అని నోరు జారాడు. అతను హర్ట్ కావడానికి మధ్యలో నేను నవ్వడం. అది అనుకోకుండా వచ్చేసింది. అయినా నేను అఖిల్‌ని కంటెస్టెంట్‌గా వెళ్తే బావుంటుందని నేను తక్కువ చేయలేదు. జడ్జీగా వెళ్తేబావుంటుందని అన్నాను. ఆ ఫీలింగ్‌తోనే నేను పోల్ పెట్టాను. సంబంధం లేకుండా అఖిల్‌ని తప్పుపట్టి.. నా స్థాయిని నేను తగ్గించుకుంటానా? అఖిల్ స్థాయి దాటి ఇంకా ఓవర్‌గా మాట్లాడి ఉంటే రియాక్ట్ అయ్యేవాడ్ని కాదు. నీ కర్మ అనుకునేవాడ్ని. నేను ఈ సీజన్‌కి అదే ఫిక్స్ అయ్యాను. నా ఉద్దేశం అది కాదని చెప్పడానికే ఈ వీడియో చేశా.
నన్ను క్రింజ్ రివ్యూవర్ అని అన్నాడు. నేను కూడా అనొచ్చు క్రింజ్ రివ్యూవర్ బెటరా.. క్రింజ్ కంటెస్టెంట్ బెటరా అని ఒక మాట అనే ముందు ఆలోచించాలి. అతనికి నేను క్రింజ్ రివ్యూవర్ అని అనిపించిందేమో.. దానికి నేను కౌంటర్ ఇవ్వదలచుకోలేదని అది రెడ్డి అన్నాడు. ఓ పక్క క్రింజ్ రివ్యూవర్ అన్నందుకు.. క్రింజ్ కంటెస్టెంట్ అని అనేసి.. దానికి కౌంటర్ ఇవ్వాలనుకోవడం లేదన్నాడు ఆదిరెడ్డి. దీన్నే అంటారు ఒక చక్కని కవర్ డ్రైవ్ అని.. ఈ వీడియో అఖిల్ సార్థక్ చూస్తే మరో వైరల్ పోస్ట్ వస్తుందనేది నిజం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



